TRS: తెలంగాణలో చంద్రబాబు బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తున్నారు: ఎంపీ కవిత ఆరోపణ

  • అమరావతిలో కాంగ్రెస్ జాబితా ఫైనల్ అయింది
  • అది కాంగ్రెసోళ్ల దురదృష్టం
  • మహాకూటమికి ప్రజలే తగినబుద్ధి చెబుతారు

అమరావతిలో కాంగ్రెస్ జాబితా ఫైనల్ కావడం కాంగ్రెసోళ్ల దురదృష్టమని టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్  మండలం లక్కోరలో దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ, తమ అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు.

తెలంగాణలో చంద్రబాబు బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని అన్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహాకూటమికి ఓటమి తప్పదని, ఆ కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News