Karnataka: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్.. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలింపు!

  • రెండ్రోజులు విచారించిన  సీసీబీ పోలీసులు
  • కీలక సమాచారం సేకరించిన అధికారులు
  • కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు కేసు

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నిన్న పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకూ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మరోసారి గాలి జనార్దన్ రెడ్డిని విచారించడం మొదలుపెట్టారు. ఈ కేసుకు, తనకు సంబంధం లేదని తొలుత బుకాయించిన గాలి జనార్దన్ రెడ్డి.. చివరికి అంబిడెంట్ కంపెనీపై ఉన్న ఈడీ కేసులో సంస్థ ప్రతినిధులకు సాయం చేసేందుకు యత్నించినట్లు అంగీకరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన పీఏ అలీఖాన్ ను సీసీబీ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వీరిద్దరినీ విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి నేడు ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు విచారించారు. గాలి సూచనల మేరకు రూ.18కోట్ల నగదును ఆర్టీజీఎస్ రూపంలో బదిలీ చేసేందుకు సహకరించిన బెంగుళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రిజేష్ రెడ్డి, ఫైజల్, జయరాంలను పోలీసులు ప్రశ్నించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కుట్ర పన్నడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించడం వంటి అభియోగాల కింద గాలిని అరెస్ట్ చేసినట్లు సమాచారం

  • Loading...

More Telugu News