Andhra Pradesh: వైసీపీలో చేరనున్న బీసీ నేత మార్గాని.. రాజమండ్రి ఎంపీ సీటుపై కన్ను!

  • రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • రాజమహేంద్రవరం సీటును కోరుతున్న నేత
  • త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ)లోకి మరో బీసీ నేత చేరికకు రంగం సిద్ధమైంది. బీసీ సంఘాల ఐకాస చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు రేపు వైసీపీలో చేరుతారని రాజమహేంద్రవరం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మజ్జి అప్పారావు తెలిపారు. రాజమహేంద్రవరం(రాజమండ్రి) నుంచి ఎంపీ సీటును మార్గానికి ఇచ్చే అవకాశం ఉందన్నారు.

మార్గాని నాగేశ్వరరావు లేదా ఆయన కుమారుడు భరత్ కు పార్లమెంటు స్థానాన్ని జగన్ కేటాయిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు మరిన్ని స్థానాలు ఇవ్వాల్సిందిగా తాము నిర్వహించిన ‘బీసీల సదస్సు’తో అన్నిరాజకీయ పార్టీల్లో కదలిక వచ్చిందన్నారు. అందులో భాగంగానే బీసీ గర్జనను ఏపీ సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నారని అప్పారావు పేర్కొన్నారు.

Andhra Pradesh
rajamahendravaram
YS Vijayamma
East Godavari District
jagan
bc leader
margani nageswara rao
  • Loading...

More Telugu News