Andhra Pradesh: హెరిటేజ్ పాల సొమ్మును చంద్రబాబు ఖర్చు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు!: బీజేపీ నేత జీవీఎల్

  • సీఎం నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు
  • మహారాజులా సొమ్మును వెదజల్లుతున్నారు
  • అధికారులు చివరికి బలిపశువులు అవుతారు

ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యపడనంత విలాసవంతమైన జీవితం గడపడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విదేశీ పర్యటనలు, చార్టెట్ ఫ్లైట్ల పేరుతో కోట్లకొద్దీ ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరులో పేదరికంలో పుట్టినా ఇప్పుడు చంద్రబాబు మహారాజులా ప్రజల సొమ్మును వెదజల్లుతున్నారని దుయ్యబట్టారు. ఈరోజు విజయవాడకు వచ్చిన గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్న అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు.

హెరిటేజ్ పాల వ్యాపారంలో సంపాదించుకున్న మొత్తాన్ని చంద్రబాబు ఖర్చు పెట్టుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఇలాంటి విచ్చలవిడి విన్యాసాలకు అనుమతులు ఇస్తున్న అధికారులు చివరికి బాధ్యులుగా నిలుస్తారని హెచ్చరించారు. చంద్రబాబు కోసం ఇష్టానుసారం అనుమతులు ఇచ్చే అధికారుల పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్లపై ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు విచ్చలవిడి ప్రజాధన దుర్వినియోగంపై అవసరమైతే హైకోర్టుకు వెళతామని చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
gvl narasimharao
funds misuse
Chief Minister
BJP
  • Loading...

More Telugu News