Andhra Pradesh: చంద్రబాబు ఓ ఊసరవెల్లి.. అధికారం కోసం రంగులు మారుస్తారు!: తమిళనాడు సీఎం పళనిస్వామి

  • కమల్ రాజకీయాలకు సరిపోడు
  • నిత్యం ప్రజలతో మమేకమవుతున్నా
  • తమిళనాడు సీఎం పళనిస్వామి వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చే ఊసరవెల్లి అని వ్యాఖ్యానించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని దుయ్యబట్టారు. అందుకే ఎవరితో అయినా జతకట్టడానికి వెనుకాడటం లేదని వ్యాఖ్యానించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తో చంద్రబాబు భేటీ అయిన నేపథ్యంలో పళని ఘాటుగా స్పందించారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చాలా ధైర్యం, ఓపిక కావాలని పళనిస్వామి వ్యాఖ్యానించారు. విశ్వరూపం-1 సినిమా రిలీజ్ సమయంలో సమస్యలు తలెత్తితే కమల్ విదేశాలకు పారిపోవడానికి సిద్ధపడ్డారనీ, అలాంటి కమల్ కు రాజకీయాల్లో నిలబడే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. లగ్జరీ జీవితాలు గడిపే నేతలు ప్రజా సమస్యలను పరిష్కరించలేరని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు పళనిస్వామి చెప్పుకొచ్చారు.

Andhra Pradesh
Tamilnadu
Chandrababu
palani swamy
stalin
dmk
  • Loading...

More Telugu News