faith healer: కష్టాలు తగ్గిస్తానని మహిళపై పలుమార్లు అత్యాచారం.. తాంత్రికుడి అరెస్ట్!

  • కష్టాలు కడతేరుస్తానంటూ తావీజు ఇచ్చిన తాంత్రికుడు
  • సంతాన భాగ్యం కల్పిస్తానంటూ పలుమార్లు అత్యాచారం
  • బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్

రోగాలు తగ్గించి కష్టాలు కడతేరుస్తానని ఓ మహిళను నమ్మబలికిన తాంత్రికుడు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. మహారాష్ట్రలోని పల్ఘర్‌లో జరిగిందీ ఘటన. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు తాంత్రికుడిని అదుపులోకి తీసుకున్నారు.

గతేడాది మేలో తాంత్రికుడు అజయ్ చౌదరి (48)తో మహిళ (37)కు పరిచయం అయింది. ఆమె తన కష్టాలను అతడితో పంచుకోవడంతో వాటి నుంచి విముక్తి కోసమంటూ ఆమెకు ఓ తావీజు ఇచ్చాడు. ఈ క్రమంలో  తనకు సంతానం కోసం సాయం చేస్తానంటూ ఈ ఏడాది అక్టోబరు వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. చివరికి అతడు తనను మోసం చేస్తున్నాడని గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్టు ఫల్ఘర్ పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

faith healer
rape
Woman
Maharashtra
palghar
  • Loading...

More Telugu News