kutumbarao: కనకదుర్గ గుడి వద్ద అడుక్కోవడానికి కూడా జీవీఎల్ పనికిరాడు: కుటుంబరావు

  • పనికిమాలిన వెధవలను రాష్ట్రంలోకి రానివ్వడమే ఎక్కువ
  • బీజేపీ నేతలను వీధి కుక్కలు కూడా అసహ్యించుకుంటున్నాయి
  • టాప్ టెన్ అబద్ధాలకోరు అని గూగుల్ లో వెతికితే మోదీ పేరే వస్తోంది

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే జీవీఎల్... ఒకసారి ఆయన ట్వీట్లకు జనాల నుంచి వస్తున్న స్పందనను చూసుకోవాలని సూచించారు. అప్పుడు జనాల్లో ఆయనకు ఏ స్థాయి ఉందో అర్థమవుతుందని అన్నారు. కనకదుర్గ గుడి దగ్గర అడుక్కోవడానికి కూడా జీవీఎల్ పనికి రాడని మండిపడ్డారు. పనికిమాలిన వెధలను ఆంధ్ర రాష్ట్రంలోకి రానివ్వడమే చాలా ఎక్కువని అన్నారు. బీజేపీ నేతలను చూసి వీధి కుక్కలు కూడా అసహ్యించుకుంటున్నాయని చెప్పారు. సొంత కుటుంబసభ్యులు కూడా వారికి ఓటు వేయరని అన్నారు.

జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే... ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నట్టు బీజేపీ నేతలకు కనిపిస్తోందా? అని కుటుంబరావు ప్రశ్నించారు. ప్రధాని కాకముందు మోదీ దేశమంతా తిరిగారని... అప్పట్లో ఆయన ఖర్చును గుజరాత్ ప్రభుత్వం భరించిందా? లేక బీజేపీ భరించిందా? చెప్పాలని డిమాండ్ చేశారు. గూగుల్ లో టాప్ టెన్ అబద్ధాల కోరు అని వెతికితే మోదీ పేరే వస్తోందని ఎద్దేవా చేశారు. 

kutumbarao
gvl
Chandrababu
modi
bjp
Telugudesam
  • Loading...

More Telugu News