manohar parikkar: రాజీనామా చేయనున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్!

  • పాంక్రియాటిక్ కేన్సర్ తో బాధపడుతున్న పారికర్
  • రెండు, మూడు రోజుల్లో నాయకత్వ మార్పు ఉంటుందన్న కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్
  • ఇటీవలే ఎయిమ్స్ లో కూడా చికిత్స పొందిన పారికర్

గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేయబోతున్నారు. పారికర్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకటి, రెండు రోజుల్లో నాయకత్వ మార్పు జరగవచ్చని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ సూచనప్రాయంగా తెలిపారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని చెప్పారు. పారికర్ ఆరోగ్యం బాగోలేదనన్న విషయం అందరికీ తెలిసిందేనని... అయినప్పటికీ, ఆయన తన బాధ్యతలను నిర్వహిస్తున్నారని అన్నారు. పని భారం ఆయన ఆరోగ్యంపై పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. పాంక్రియాటిక్ కేన్సర్ తో పారికర్ బాధపడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో చికిత్స పొందిన పారికర్... ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్ లో కూడా చికిత్స తీసుకున్నారు. అక్టోబర్ 14న ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

manohar parikkar
goa
cm
resign
bjp
  • Loading...

More Telugu News