ap: మంత్రి పదవిపై నాకు ఎలాంటి సమాచారం లేదు: కిడారి కుమారుడు శ్రవణ్

  • రేపే ఏపీ కేబినెట్ విస్తరణ
  • ఫరూక్, కిడారి శ్రవణ్ లకు స్థానం
  • చంద్రబాబుతో చర్చించిన తర్వాత స్పందిస్తానన్న శ్రవణ్

రేపు ఏపీ కేబినెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తరించనున్నారు. బీజేపీ నేతల రాజీనామాలతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను మైనార్టీ, ఎస్టీ అభ్యర్థులకు ఆయన కేటాయించనున్నారు. మైనార్టీల కింద శాసనమండలి ఛైర్మన్ ఫరూక్ కు అవకాశం కల్పించనున్నారు. ఎస్టీ కేటగిరిలో ఇటీవలే మావోయిస్టుల చేతిలో హతమైన కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రవణ్ కుమార్ ను కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై శ్రవణ్ స్పందించారు.

ఓ న్యూస్ ఛానల్ తో శ్రవణ్ మాట్లాడుతూ, మంత్రి పదవిపై తనకు ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాతే ఈ విషయంపై స్పందిస్తానని తెలిపారు. మరోవైపు, శ్రవణ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారన్న వార్తలపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ap
cabinet
expansion
Chandrababu
kidari sarveswara rao
son
sravan
  • Loading...

More Telugu News