Madhava Reddy: పేదలకిచ్చిన హామీని వదిలేసిన కేసీఆర్.. రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు: కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి
- కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన ఇళ్లను ఎద్దేవా చేశారు
- రూ.5 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నారు
- మహాకూటమి విజయమే చంద్రబాబు లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన ఇళ్లను 2014 ఎన్నికల్లో ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.5 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇస్తామని చెప్పి, నేటి వరకూ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దొంతి మాధవ రెడ్డి అన్నారు.
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల హామీని నెరవేర్చని కేసీఆర్ తాను మాత్రం రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. నర్సంపేట నుంచి మహాకూటమి తరుపున పోటీ చేస్తున్నానని.. గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే భారీ మెజారిటీతో తనను గెలిపించేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాధవరెడ్డి తెలిపారు. సీట్ల కోసం చంద్రబాబు చూడట్లేదని.. మహాకూటమి విజయమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.