ap: 11న ఏపీ కేబినెట్ ను విస్తరించనున్న చంద్రబాబు

  • బీజేపీ నేతల రాజీనామాలతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు
  • కేబినెట్ ను విస్తరించే పనిలో చంద్రబాబు
  • ఫరూక్, కిడారి కుమారులకు పదవులు దక్కే ఛాన్స్

ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. 11వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కేబినెట్ విస్తరణ ప్రక్రియను ఆయన ప్రారంభించనున్నారు. మైనార్టీ, ఎస్టీ అభ్యర్థులతో ఈ రెండు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్ గా ఉన్న ఫరూక్ కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, మావోయిస్టుల చేతిలో హతమైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి కూడా మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మార్చి 8న బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో... ఆ రెండు పదవులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో, ఈ రెండు ఖాళీలు భర్తీ చేసే పనిలో ముఖ్యమంత్రి పడ్డారు.

ap
cabinet
expansion
Chandrababu
  • Loading...

More Telugu News