exit polls: ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించిన ఎన్నికల సంఘం

  • ఈ నెల 12 నుంచి డిసెంబర్ 7 సాయంత్రం 5.30 వరకు నిషేధం
  • నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎన్నికల సంఘం
  • ఈనెల 12న చత్తీస్ గఢ్ లో తొలి దశ పోలింగ్ 

మరో మూడు రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. చత్తీస్ గఢ్ లో ఈనెల 12న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఇతర రాష్ట్రాలకు దశలవారీగా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 7వ తేదీన తెలంగాణ, రాజస్థాన్ లకు జరిగే ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను సోమవారం నాడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.  

exit polls
ban
election commission
  • Loading...

More Telugu News