: నైట్ రైడర్స్ కు ఊరడింపు


రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తొలుత పటిష్టమైన బెంగళూరును 115 పరుగులకే కట్టడి చేసిన కోల్ కతా అనంతరం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కోల్ కతా జట్టులో కలిస్ 41 పరుగులు చేయగా, తివారీ 28 పరుగులతో రాణించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కోల్ కత విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా, టెన్ డష్కాటె ఫోర్ కొట్టి మరో 4 బంతులు మిగిలుండగానే జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ విజయం కోల్ కతాకు పెద్దగా ఉపయోగపడనప్పటికీ, రాయల్ చాలెంజర్స్ పై ఈ మ్యాచ్ ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది. మరో రెండు మ్యాచ్ లే ఆడాల్సి ఉన్న బెంగళూరు ఆ రెండింటిలో తప్పక నెగ్గితేనే ప్లే ఆఫ్ దశలోకి ప్రవేశించగలుగుతుంది.

  • Loading...

More Telugu News