rape attept on sister in law: వదినపై అఘాయిత్యం.. అడ్డుకున్న తండ్రిపై దౌర్జన్యం!

  • తండ్రి కళ్లముందే ఆమెను వాష్‌రూంలోకి తీసుకువెళ్లే యత్నం
  • నిరోధించిన తండ్రిపై కర్రతో దాడి
  • కొడుకు నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి

సొంత వదినపైనే అఘాయిత్యానికి తెగబడ్డాడు ఓ మరిది. దీన్ని గమనించిన అతని తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతనిపైనా దౌర్జాన్యానికి దిగాడు. కొడుకు తీరును తప్పుపట్టిన తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం రజార్‌హట్‌ పట్టణంలోని హరోకల్‌ ప్రాంతానికి చెందిన జాంతు సర్దార్‌ (40) ఇంట్లోని అన్న భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఓ రోజు ఆమెను వాష్‌రూంలోకి బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేస్తుండగా అతని తండ్రి (బాధితురాలి మామ) జాయ్‌దేబ్‌ సర్దార్‌ (74) అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన జాంతుసర్దార్‌ దొరికిన కర్ర తీసుకుని అతని తలపై కొట్టాడు.

ఈ వివాదాన్ని గమనిస్తున్న జాయ్‌దేబ్‌ మరో కొడుకు కత్తి తీసి బెదిరించి అన్నను నిలువరించాడు. అనంతరం కొడుకుపై జాయ్‌దేబ్‌ సర్దార్‌ స్వయంగా ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

rape attept on sister in law
West Bengal
rajarhut town
  • Loading...

More Telugu News