china army: భారత రక్షణ వ్యవస్థపై గురి పెట్టిన చైనా మిలిటరీ: ఇంటెలిజెన్స్

  • యూనిట్ 61398 పేరుతో కార్యకలాపాలు
  • రహస్యంగా భౌగోళిక సమాచారాన్ని సేకరిస్తున్న చైనా ఆర్మీ
  • ఇది ఆందోళన కలిగించే అంశమన్న ఇంటెలిజెన్స్ అధికారి

భారత రక్షణ వ్యవస్థపై చైనా మిలిటరీ గురి పెట్టిందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని చైనా సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపాయి. దీని కోసం చైనా ఆర్మీ ఇప్పటికే ఓ ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేసుకుందని చెప్పాయి. ఇంటెలిజెన్స్ కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, సైబర్ స్పేస్ లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించడం, అంతర్జాతీయంగా డిజిటల్ కమ్యూనికేషన్ ను అవగతం చేసుకోవడంపై ఈ విభాగం దృష్టి సారించిందని తెలిపారు. యూనిట్ 61398 పేరుతో ఇప్పటికే రహస్యంగా భౌగోళిక సమాచారాన్ని సేకరిస్తోందని చెప్పారు. షాంఘైలోని ప్రధాన కార్యాలయంలో యూనిట్ 61398 కార్యకలాపాలను సాగిస్తోందని... ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

  • Loading...

More Telugu News