Andhra Pradesh: చంద్రబాబు ఆంధ్రాలో పోలీసు రాజ్యం నడుపుతున్నారు!: బీజేపీ నేత జీవీఎల్

  • అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు
  • మా నాయకుడిపై లాఠీ చార్జీ చేశారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన నేత

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎలాంటి తప్పు చేయకున్నా తమను అకారణంగా అడ్డుకుని అరెస్ట్ చేశారని అన్నారు. ‘సేవ్ డెమోక్రసి’ పేరుతో సభలు నిర్వహించే బాబు ఏపీలో మాత్రం పోలీస్ రాజ్యం నిర్వహిస్తున్నారని విమర్శించారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ బీజేపీ నేత మాణిక్యాలరావును పరామర్శించడానికి వెళుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తనతో పాటు చాలామంది నేతలను అకారణంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Andhra Pradesh
Chandrababu
gvl
bjp
kanna
arrest
attack
Telugudesam
  • Loading...

More Telugu News