Andhra Pradesh: అమలాపురంలో 10 లక్షల మందితో శెట్టి బలిజ మహాసభ నిర్వహిస్తాం!: జనసేన నేత పితాని బాలకృష్ణ

  • సామాజికవర్గం సమస్యల పరిష్కారానికి
  • కార్పొరేషన్ ఏర్పాటుకు పనవ్ కల్యాణ్ హామీ
  • ఈ నెల 11న సభకు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ లో శెట్టి బలిజ సామాజిక వర్గం సమస్యలు పరిష్కరించేందుకు 10 లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామని జనసేన నేతలు పితాని బాలకృష్ణ, దొమ్మేటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 11న తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో ‘శెట్టి బలిజ మహాసభ’ను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సదస్సు ద్వారా శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తామన్నారు. తమ సామాజిక వర్గం అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పార్టీ అధినేత పవన్ హామీ ఇచ్చారన్నారు.

ముమ్మిడివరం నియోజక వర్గం సీటును జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తొలిసారిగా శెట్టిబలిజ సామాజికవర్గ నేతగా తనకు కేటాయించారని పితాని బాలకృష్ణకు తెలిపారు. తద్వారా బీసీలపై ఉన్న ప్రేమను పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారన్నారు. మరోనేత గింజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలలో పేదలు ఉన్నారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాల్సిందిగా కార్యకర్తలను కోరారు.

Andhra Pradesh
East Godavari District
janasena
party
setti balija
11th november
10 lakh people
amalapuram
  • Loading...

More Telugu News