East Godavari District: తూర్పు గోదావరిలో దారుణం..నోట్లో గుడ్డలు కుక్కి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్!

  • యువతిపై ఇద్దరు దుండగుల అఘాయిత్యం
  • ఇంట్లో బంధించి సామూహిక అత్యాచారం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంట్లో ఓ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు యువకులు దారుణానికి తెగబడ్డారు. ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని అయినవిల్లి మండలం, అయినవిల్లిలంకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు కన్నేశారు. ఈ నేపథ్యంలో నిన్న బాలిక ఇంట్లో ఉండటాన్ని గమనించిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి దూరి ఆమెను బంధించారు.

అనంతరం బలవంతంగా నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. చివరికి తల్లిదండ్రులతో కలిసి బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

East Godavari District
Andhra Pradesh
gang rape
minor girl
two youth
  • Loading...

More Telugu News