Kurnool District: కలకలం రేపిన కర్నూలు రేవ్ పార్టీ... అసలు వివాదం మొదలైందిక్కడే!

  • డ్యాన్సర్ల కన్నా అధిక సంఖ్యలో ఏజంట్లు
  • అమ్మాయిలతో కలసి నృత్యాలు చేసేందుకు పోటీ
  • తీవ్ర రభసతో మధ్యలోనే ఆగిన పార్టీ

దీపావళి సందర్భంగా కర్నూలులో జరిగిన రేవ్ పార్టీ, అందులో జరిగిన రభస తీవ్ర చర్చనీయాంశం కాగా, పలువురు ఫర్టిలైజర్ దుకాణ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పార్టీని ఓ ఫర్టిలైజర్ సంస్థ కల్లూరు సమీపంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అశ్లీల నృత్యాలు చేసేందుకు, ఆపై ఏజంట్లతో ఏకాంతంగా గడిపేందుకు ముంబై, హైదరాబాద్, రాజమండ్రి ప్రాంతాల నుంచి కొందరు యువతులను నిర్వాహకులు రప్పించారు.

అయితే, పార్టీలో పాల్గొన్న ఏజంట్ల సంఖ్య అధికంగా ఉండటం, డ్యాన్సులు వేసేందుకు వచ్చిన యువతుల సంఖ్య తక్కువగా ఉండటంతోనే గొడవ ప్రారంభమైనట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. అమ్మాయిలతో తాము డ్యాన్సులు వేస్తామంటే, తాము వేస్తామంటూ ఒక్కసారిగా ఏజంట్లు వేదిక పైకి చేరుకోవడం తీవ్ర రసాభాసకు కారణంకాగా, ఆపై అమ్మాయిలతో ఏకాంతంగా గడిపేందుకు ఏజంట్లు పోటీ పడ్డారు.

దీంతో అక్కడి వాతావరణంపై అసహనాన్ని వ్యక్తం చేసిన డ్యాన్సర్లు, తాము వెళ్లిపోతామనడంతో వివాదం మరింతగా పెరిగి, వారితోను, నిర్వాహక సంస్థపైనా ఏజంట్లు గొడవకు దిగారు. పార్టీ మధ్యలోనే ముగియగా, విషయం మీడియాకు ఎక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఈ పార్టీలో పాల్గొన్న వారి వివరాలను ఆరా తీస్తూ, వారిపై కేసులు పెడుతున్నారు.

Kurnool District
Rave Party
Kalluru
Fertilizer Company
Dancers
  • Loading...

More Telugu News