West Godavari District: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

  • చాక్లెట్లు కొనిస్తానని బాలికను నమ్మించిన వృద్ధుడు
  • అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా గమనించిన స్థానికులు
  • దేహశుద్ధి చేసి స్థానికులకు అప్పగింత

ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారి గూడెంలో జరిగింది. బాలికకు చాక్లెట్లు కొనిస్తానని నమ్మించిన వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడగా గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడైన వృద్ధుడిని స్థానిక ఎంపీటీసీ తండ్రిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

West Godavari District
Girl
molestation
MPTC
  • Loading...

More Telugu News