Telangana: చూసుకోండి.. కేసీఆర్‌పై గెలిచి చరిత్ర సృష్టిస్తా: వంటేరు ప్రతాప్ రెడ్డి

  • కేసీఆర్‌పై గెలుపు నాదే
  • గజ్వేలు ప్రజలు పట్టం కట్టేది నాకే
  • కేసీఆర్, హరీశ్‌రావులపై వ్యక్తిగత కక్ష లేదు

వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గెలిచి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతానని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై తనకు చాలా గౌరవం ఉందని, అయితే.. ఆయన పరిపాలనే అధ్వానంగా ఉందని విమర్శించారు. కేసీఆర్‌పైనా, హరీష్‌రావుపైనా తనకు వ్యక్తిగత కక్ష లేదన్నారు.

తానెప్పుడూ పేదల పక్షమేనన్న ప్రతాప్‌రెడ్డి వారికి న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు. కేసీఆర్‌పై గెలిచి చరిత్ర సృష్టిస్తానన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. నిజయోజకవర్గంలోనే ఉంటున్నానని, ప్రజలు తనను గెలపిస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గజ్వేలులో టీఆర్ఎస్ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బిర్యానీ, బీరు పంపిణీ చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి వాటికి చెక్ పెట్టాలని వంటేరు డిమాండ్ చేశారు.

Telangana
gajwel
TRS
KCR
Vanteru pratap Reddy
Congress
  • Loading...

More Telugu News