Telangana: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి తప్పిన ప్రమాదం

  • ముషీరాబాద్‌లో సదర్ వేడుకలు
  • తిలకించేందుకు వచ్చిన మహమూద్ అలీ
  • జనాలపైకి దూసుకొచ్చిన దున్నపోతులు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నిర్వహించిన సదర్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. దున్నపోతులను తిలకించిన అనంతరం ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా రెండు దున్నపోతులు జనాలపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో అలీకి చెందిన రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటన అనంతరం అలీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదుపు తప్పిన దున్నపోతులను కట్టడి చేసేందుకు నిర్వాహకులు కష్టపడాల్సి వచ్చింది. జనాలపైకి వచ్చిన రెండు దున్నపోతులను కట్టడి చేసేందుకు దాదాపు 30 మంది ప్రయత్నించి ఎట్టకేలకు వాటిని అదుపు చేశారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Telangana
Deputy CM
Mahmood Ali
Musheerabad
Hyderabad
  • Loading...

More Telugu News