Telangana: కాంగ్రెస్ నేతలు ఏం చెబుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు!: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

  • కూటమిపై అన్ని పక్షాలు నిర్ణయం తీసుకోవాలి
  • కొత్తగూడెం సీటును గట్టిగా కోరుతున్నాం
  • ఎల్లుండి పార్టీ కార్యవర్గ సమావేశాలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఏం చెబుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాకూటమి తరఫున పోటీ చేసేందుకు అన్ని పక్షాలు సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కొత్తగూడెం సీటును సీపీఐకి ఇవ్వాల్సిందిగా గట్టిగా కోరుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీలో తమ పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని గట్టిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సీట్ల కేటాయింపు వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎల్లుండి హైదరాబాద్ లో సీపీఐ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.

Telangana
Congress
cpi
chada venkata reddy
praja kutami
Hyderabad
media
kottagudem
  • Loading...

More Telugu News