Tamilnadu: జాతకం చెప్పడంలో ప్రావీణ్యం కోసం చిన్నారిని బలి ఇచ్చిన మహిళ!

  • తమిళనాడులోని పుదుకొట్టైలో ఘటన
  • ఆలయం వద్ద బలి ఇచ్చి పరారీ
  • నిందితురాలి కోసం పోలీసుల గాలింపు

ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు వస్తున్నా ప్రజలు మూఢనమ్మకాలను మాత్రం వదలడం లేదు. తాజాగా జాతకాలు చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఓ మహిళ దారుణానికి తెగబడింది. నాలుగేళ్ల చిన్నారిని కనికరం లేకుండా బలి ఇచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కరుంపట్టికిలో ఉంటున్న చిన్నపిళ్లై అనే మహిళ జాతకాలు, సోది చెప్పేది. ఈ విద్యలో మరింత ప్రావీణ్యం సంపాదించాలంటే నరబలి ఇవ్వాలని నమ్మిన ఆమె.. ఓ నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసింది. అనంతరం బాలికను తీసుకెళ్లి ఆలయం దగ్గర బలి ఇచ్చి ఘటనాస్థలం నుంచి పరారైంది.

మరోవైపు రక్తపు మడుగులో పడిఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న చిన్నపిళ్లై కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Tamilnadu
murder
killed
sacrifice
pudukottai
temple
women
by women
convict
Horoscope
  • Loading...

More Telugu News