Tamilnadu: తమిళనాడులో దీపావళి ఎఫెక్ట్.. వెయ్యి మందిపై కేసులు, 600 మంది అరెస్ట్!
- నిబంధనలు ఉల్లంఘించారంటూ దారుణం
- కేసులు పెట్టిన పోలీసులు
- 200 మంది రిమాండ్ కు తరలింపు
దీపావళి పండుగ వేళ తమిళనాడు అంతటా టెన్షన్, టెన్షన్ వాతావరణం నెలకొంది. పండుగ సందర్భంగా నిన్న ఉదయం 6 గంటల నుంచి 7 వరకూ.. తిరిగి రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో బాణసంచా కాల్చుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను చాలాచోట్ల ప్రజలు పట్టించుకోలేదు. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు కొరడా ఝుళిపించారు. తమిళనాడు వ్యాప్తంగా 1,000 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 600 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, 400 మంది ప్రజలు బెయిల్ పై బయటకు వచ్చారు. మిగతావారిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.