Pawan Kalyan: ఆయన ఆశీస్సులుంటే పిఠాపురం నుంచే పోటీ చేస్తానేమో!: పవన్ కల్యాణ్

  • ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయమంటున్నారు
  • శ్రీపాదవల్లభుడు నడయాడిన నేల ఇదే
  • అదే ఆ దేవుడి ఆజ్ఞ అయితే అప్పుడు చూద్దాం

శ్రీపాద వల్లభుడి ఆశీస్సులు ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచే తాను పోటీ చేస్తానేమోనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి తనను పోటీ చేయమని చాలా మంది అడుగుతున్నారని అన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయమని మత్స్యకారులు తనను అడుగుతుంటే ఇక్కడి ప్రత్యేకత ఏమిటో తనకు అర్థం కాలేదని, ఆ తర్వాత తనకు అర్థమైందని, శ్రీపాదవల్లభుడు నడయాడిన నేల ఇదేనని అన్నారు.

పిఠాపురం నుంచే తాను పోటీ చేయాలన్నది ఆ దేవుడి ఆజ్ఞ అయితే అప్పుడు చూద్దామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న నిర్ణయం తనది కాదని, సెలక్షన్ కమిటీ అన్ని అంశాలను బేరీజు వేస్తుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి, అనంతపురం, ఇచ్చాపురం నుంచి కూడా తనను పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయం ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.

Pawan Kalyan
Jana Sena
pitapuram
  • Loading...

More Telugu News