laloo prasad yadav: హోటల్ గది నుంచి అదృశ్యమైన లాలూ ప్రసాద్ కుమారుడు తేజ్ ప్రతాప్

  • రాంచీలో తండ్రిని కలిసిన తేజ్ ప్రతాప్
  • పాట్నాకు తిరిగివస్తూ.. బుద్ధగయలోని హోటల్ లో బస
  • సెక్యూరిటీ కళ్లు గప్పి.. వెళ్లిపోయిన లాలూ కుమారుడు

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ హోటల్ నుంచి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, జార్ఖండ్ రాజధాని రాంచీలో జైల్లో ఉన్న తన తండ్రిని నిన్న ఆయన పరామర్శించారు. ఆ తర్వాత రాంచీ నుంచి బీహార్ రాజధాని పాట్నాకు బయల్దేరారు. మార్గమధ్యంలో బుద్ధగయలో ఓ హోటల్ లో నిన్న రాత్రి బస చేశారు.

అనంతరం ఫోన్ లో మాట్లాడుకుంటూ హోటల్ గది నుంచి తేజ్ ప్రతాప్ బయటకు వచ్చారు. తన సెక్యూరిటీ కళ్లుగప్పి, హోటల్ బ్యాక్ డోర్ ద్వారా వెళ్లిపోయారు. తన కారులోనే ఆయన వెళ్లినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ లోని వృందావన్ కు ఆయన వెళ్లినట్టు భావిస్తున్నారు. తన భార్య ఐశ్వర్య రాయ్ తో విడాకులు ఇప్పించాలని కోర్టులో తేజ్ ప్రతాప్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై తన తండ్రితో ఆయన చర్చించారు. ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో తెలియదు కానీ... హోటల్ గది నుంచి మాత్రం ఆయన అదృశ్యమవడం సంచలనమైంది.

laloo prasad yadav
tej pratap yadav
ranchi
patna
escape
bodh gaya
  • Loading...

More Telugu News