l ramana: ఎల్. రమణ సంచలన నిర్ణయం.. ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న టీటీడీపీ అధ్యక్షుడు

  • జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థికి అండగా ఉంటానన్న రమణ
  • మహాకూటమి గెలుపే తన లక్ష్యం
  • టీఆర్ఎస్ పాలనకు ముగింపు పలుకుతాం

తెలంగాణలో మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి అండగా ఉంటానని చెప్పారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలకడమే తన లక్ష్యమని అన్నారు. 1994లో తొలిసారి జగిత్యాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి రమణ గెలుపొందారు. అనంతరం అక్కడ నుంచి ఐదు సార్లు పోటీ చేశారు. మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.

l ramana
tTelugudesam
mahakutami
elections
  • Loading...

More Telugu News