Jagan: జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వాలంటూ మరో పిటిషన్ వేసిన సిట్

  • గత విచారణలో తగిన వివరాలను రాబట్టలేకపోయాం 
  • మరోసారి అతన్ని విచారించాల్సిన అవసరం ఉంది
  • శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వండి

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ ను విచారించేందుకు... కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. ఆరు రోజుల పాటు జరిపిన విచారణలో తగిన విషయాలను రాబట్టలేకపోయామని... మరోసారి అతన్ని విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో తెలిపింది.

శనివారం నాడు శ్రీనివాస్ కస్టడీ ముగిసిన సంగతి తెలిసిందే. కోర్టులో అతన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా కస్టడీని పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. అయితే, ఆ పిటిషన్ ను న్యాయయూర్తి తిరస్కరించారు. శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో, సిట్ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. దీపావళి తర్వాత మరోసారి విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jagan
stab
srinivas
custody
petetion
sit
  • Loading...

More Telugu News