Chandrababu: జోరు పెంచిన చంద్రబాబు.. 20 తర్వాత చెన్నైకి.. స్టాలిన్, కుమారస్వామితో చర్చలు

  • బీజేపీ వ్యతిరేక కూటమిని కూడగట్టడంలో చంద్రబాబు బిజీ
  • స్టాలిన్, కుమారస్వామితో కీలక చర్చలు
  • జనవరిలో ఢిల్లీలో విస్తృతస్థాయి సమావేశం

బీజేపీ వ్యతిరేక కూటమిని కూడగట్టడంలో తొలి దశలో విజయం సాధించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోరు పెంచారు. ఈ నెల 20 తర్వాత చెన్నై వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ చర్చలు జరపనున్నట్టు సమాచారం.

అయితే, చంద్రబాబు కచ్చితంగా చెన్నై ఎప్పుడు వెళ్లేది వచ్చే వారం ఖరారు కానుంది. వీరిద్దరితో భేటీ అనంతరం జనవరిలో ఢిల్లీలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో కూటమి రూపు రేఖలపై చర్చిస్తారు. నిజానికి ఈ సమావేశాన్ని వచ్చే నెలలోనే నిర్వహించాలని ముందుగా భావించారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో నేతలు తీరిక లేకుండా ఉన్నారు. దీంతో ఈ సమావేశాన్ని జనవరికి వాయిదా వేశారు.

Chandrababu
BJP
Congress
stalin
kumara swamy
Karnataka
Tamil Nadu
  • Loading...

More Telugu News