Park Hayat: పార్క్ హయత్‌లో మహాకూటమి నేతల కీలక సమావేశం!

  • పొత్తులపై నేటికీ వీడని సందిగ్ధత
  • అసహనం వ్యక్తం చేస్తున్న సీపీఐ
  • తొమ్మిది స్థానాల ప్రకటన

మహాకూటమి ముఖ్య నేతలు నేటి సాయంత్రం పార్క్ హయత్ హోటల్లో భేటీ అయ్యారు. ఇప్పటివరకూ భాగస్వామ్య పక్షాలన్నీ పలుమార్లు భేటీ అయినా కూడా పొత్తులపై సందిగ్ధత వీడలేదు. నామినేషన్ గడువు దగ్గరపడుతుంటడంతో ఈ విషయమై మహాకూటమిలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఇదే అంశంపై సీపీఐ అసహనం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు పార్క్ హయత్‌లో జరుగుతున్న భేటీకి కూడా సీపీఐ హాజరు కాలేదు.

తాము పోటీ చేయదలుచుకున్న తొమ్మిది స్థానాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మీడియా ద్వారా వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పొత్తుల విషయాన్ని తేల్చాలని, లేదంటే అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని సీపీఐ వెల్లడించింది. పార్క్ హయత్‌లో జరుగుతున్న భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, ఎల్.రమణ, కోదండరాం పాల్గొన్నారు.

Park Hayat
L.Ramana
Uttam Kumar Reddy
Kunthiya
kondandaram
  • Loading...

More Telugu News