Chandrababu: చంద్రబాబు వదిలిన బాణాలు టీఆర్ఎస్‌ను ఏమీ చేయలేవు: గట్టు రాంచందర్‌రావు

  • చంద్రబాబు శిఖండిలా వాడుకుంటున్నారు
  • తక్షణమే హరీశ్‌రావుకు క్షమాపణ చెప్పాలి
  • ప్రజా సమక్షంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలి

కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రాంచందర్ రావు  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారిద్దరూ చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని.. వారిని ఆయన శిఖండిలా వాడుకుంటున్నారని ఆరోపించారు.

వ్యక్తిగత విమర్శలను చేయడం మానుకుని ప్రజా సమక్షంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు వదిలిన బాణాలు టీఆర్ఎస్‌ను ఏమీ చేయలేవని.. తక్షణమే హరీశ్‌రావుకు రేవూరి, వంటేరు క్షమాపణ చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని వదిలేసి వస్తే వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని విమర్శించారు.

Chandrababu
Gattu Ramachandra Rao
Revuri Prakash Reddy
Vanteru Prathapa Reddy
TRS
  • Loading...

More Telugu News