jc diwakar reddy: జేసీ దివాకర్ రెడ్డి కోడికత్తితో ఒకసారి పొడుచుకోవాలి: రోజా

  • అన్ని విమాన సంస్థలు ఆయనపై నిషేధం విధించిన సంగతిని మర్చిపోయినట్టున్నారు
  • దివాకర్ ట్రావెల్స్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు
  • రెడ్డి పేరుతో కుల రాజకీయాలు చేస్తున్నారు

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి గురించి వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోడికత్తితో దివాకర్ రెడ్డి ఒకసారి పొడుచుకుని చూడాలని... దాని బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆమె అన్నారు.

ఎయిర్ పోర్టు సిబ్బందిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు తనపై నిషేధం విధించిన విషయాన్ని దివాకర్ రెడ్డి మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. దివాకర్ ట్రావెల్స్ వల్ల ఎంతో మంద్రి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా ఆయన మరచిపోయారని అన్నారు. రెడ్డి పేరుతో ఆయన కులరాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు. 

jc diwakar reddy
roja
jagan
ysrcp
Telugudesam
stab
dewakar travels
  • Loading...

More Telugu News