Punjnb state: దీపావళి పండగ ముందు ఉద్యోగులకు పంజాబ్‌ ప్రభుత్వం షాక్‌

  • జీతాల అకౌంట్‌కు రెండు నెలల మొత్తం జమ
  • ఓ నెల జీతం అదనంగా ఇచ్చిందని భావించిన ఉద్యోగులు
  • పొరపాటున పడిందని, డ్రా చేయొద్దని ప్రకటించడంతో నిరాశ

పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపాపళి పండుగ ముందు చిన్న షాక్‌ తగిలింది. తమ జీతాల ఖాతాకు ఒకేసారి రెండు నెలలు వేతనం జమ కావడంతో ఉద్యోగులంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. పండుగ నేపథ్యంలో ఓ నెల జీతం బోనస్‌గా ప్రభుత్వం ఇచ్చి ఉంటుందని సంబరపడ్డారు. తీరా కొద్ది గంటలు గడవక ముందే ట్రెజరీ అధికారుల ప్రకటనతో నిరాశ చెందారు.

‘ఉద్యోగుల ఖాతాకు అక్టోబర్‌ నెలకు సంబంధించి రెండు నెలల వేతనం జమయింది. సాంకేతిక సమస్య వల్ల ఈ పొరపాటు జరిగింది. కావున ఉద్యోగులు ఒక నెల జీతం మాత్రమే డ్రా చేయాలి. మిగిలిన నెల మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాం’  అని అమృత్‌సర్‌ జిల్లా ట్రెజరీ అధికారి ఎ.కె.మైనీ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు నోటీసులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఉత్సాహం ఆవిరైంది. ఒక్క అమృత్‌సర్‌ జిల్లాలోనే ఈ విధంగా ఉద్యోగుల ఖాతాకు రూ.50 కోట్లు అదనంగా జమయినట్లు ట్రెజరీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తాలను వెనక్కితీసుకునే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News