: 'నన్ను నమ్మండి మొర్రో' అంటున్న బన్సల్
మేనల్లుడి నిర్వాకమో, తన పాపమో తెలియదు కానీ, పవన్ కుమార్ బన్సల్ పదవీచ్యుతులయ్యారు. తన సోదరి కుమారుడు విజయ్ సింగ్లాతో తనకెలాంటి లావాదేవీలు లేవని మరోసారి మొత్తుకుంటున్నారు బన్సల్. అయినా, ఈ వ్యవహారంలో నిజం నిగ్గుతేలాలంటే సీబీఐ విచారణతోనే సాధ్యమని నమ్ముతున్నారీ చండీగఢ్ ఎంపీ. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడారు బన్సల్. సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తానంటూ, తన నిజాయతీని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఏం చెప్పానో ఇప్పుడూ అదే చెబుతున్నానని, తనకే పాపమూ తెలియదని బన్సల్ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవం తప్పక బయటికొస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు బన్సల్.