hyper aadi: 'జబర్దస్త్' నుంచి తప్పుకున్న హైపర్ ఆది?

  • హైపర్ ఆదికి మంచి క్రేజ్ 
  • 'జబర్దస్త్' షోలో కనిపించని ఆది 
  • రకరకాల ఊహాగానాలు    

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది నటులు పాప్యులర్ అయ్యారు. ఈ షో నుంచి సినిమాలకి వెళ్లినవాళ్లు చాలామందే వున్నారు. అలాంటి వాళ్లలో 'హైపర్ ఆది' ఒకరుగా కనిపిస్తాడు. 'జబర్దస్త్' షోలో హైపర్ ఆది టీమ్ లీడర్ గా కనిపించేవాడు. ఆయన స్కిట్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటాడు. ఆయన స్కిట్స్ లోని పంచ్ డైలాగ్స్ కి జనం పడిపడి నవ్వేవారు. అలాంటి హైపర్ ఆది ఈ షోలో రెండు వారాలుగా కనిపించడం లేదు. దాంతో ఈ విషయంపై ఫిల్మ్ నగర్లో రకరకాల వార్తలు  వినిపిస్తున్నాయి.

సినిమా అవకాశాలపైనే హైపర్ ఆది పూర్తి దృష్టి పెట్టాడనీ, అందువల్లనే 'జబర్దస్త్' నుంచి తప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల అభిమానాన్ని చూపించే హైపర్ ఆది, 'జనసేన' పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసమే ఈ షోకి దూరమయ్యాడని మరికొంతమంది అంటున్నారు. ఇక విషయంపై యూట్యూబ్ లోను రకరకాల వార్తలు  ప్రచారమవుతున్నాయి. అసలు విషయమేమిటనేది హైపర్ ఆదినే చెబుతాడేమో చూడాలి.   

hyper aadi
  • Loading...

More Telugu News