Sabitha Indra Reddy: నేను గెలిస్తే సీఎం కావొచ్చు!: సబితా ఇంద్రారెడ్డి

  • లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా
  • శ్రీరాంనగర్ కాలనీకి వచ్చి అభివృద్ధిని చూడాలి
  • కాలనీవాసులు పేదరికంలో మగ్గుతున్నారు

కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం చాలా మంది సీనియర్లు పోటీపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నేడు మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు.

మహేశ్వరం నుంచి తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు మహేశ్వరంలోని శ్రీరాంనగర్ కాలనీకి వచ్చి చూడాలన్నారు. కాలనీ వాసులు పేదరికంలో మగ్గుతున్నారని సబితా ఇంద్రారెడ్డి వాపోయారు.

Sabitha Indra Reddy
Congress
Maheswaram
TRS
Sriram Nagar Colony
  • Loading...

More Telugu News