vote for note: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకోలేరు!: వైసీపీ నేత రోజా

  • పక్కా ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిపోయారు
  • ఎయిర్ పోర్టులో రెస్టారెంట్ టీడీపీ నేతదే
  •  కత్తిని జనవరి నుంచి దాచిపెట్టారు

తెలంగాణలో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శిక్ష తప్పదని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో సాక్ష్యాలతో బాబు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. చిత్తూరులో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి ఘటనలో సీఎం చంద్రబాబే తొలి ముద్దాయని రోజా ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఫ్యూజన్ రెస్టారెంట్ ను నడుపుతున్నది టీడీపీ నాయకుడేనని రోజా గుర్తుచేశారు. కత్తిని జనవరి నుంచి రెస్టారెంట్ లో దాచిపెట్టడం, దాడి జరిగిన రెండు గంటల్లో ఏడాది క్రితం నాటి పోస్టర్లు మార్ఫింగ్ తో బయటకు రావడం చూస్తుంటే ఇందులో కుట్ర కోణం ఉందని అనుమానం కలుగుతోందన్నారు.

vote for note
Telangana
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Visakhapatnam District
knife attack
airport
YSRCP
Jagan
roja
leader
critise
video
audio
proof
  • Loading...

More Telugu News