kanaka durga temple: మెమొంటోల పంపిణీలో అవకతవకలు.. దుర్గగుడి రికార్డు అసిస్టెంట్ పై సస్పెన్షన్

  • మెమొంటోల పంపిణీలో అవకతవకలు
  • ఎక్కువ మెమొంటోలు కొనుగోలు చేసినట్టు బిల్లులు
  • ఏఈవో అచ్యుతరామయ్యకు మెమో జారీ

విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాల సాంస్కృతిక కార్యక్రమాల్లో మెమొంటోల పంపిణీలో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో సిబ్బందిపై ఈవో కోటేశ్వరమ్మ చర్యలు చేపట్టారు.1200 మెమెుంటోల స్థానంలో 2 వేల మెమొంటోలు కొనుగోలు చేసినట్టు చూపించిన బిల్లులపై సంతకాలు చేసిన దుర్గగుడి ఏఈవో అచ్యుతరామయ్య, రికార్డు అసిస్టెంట్ లపై చర్యలు తీసుకున్నారు. రికార్డు అసిస్టెంట్ ను సస్పెండ్ చేయగా, ఏఈవో అచ్యుతరామయ్యకు మెమో జారీ చేశారు. కనకదుర్గ ప్రభ ఒప్పంద ఉద్యోగి సైదాను విధుల నుంచి తొలగించారు. 

kanaka durga temple
Vijayawada
eo koteswaramma
  • Loading...

More Telugu News