Andhra Pradesh: చంద్రబాబును శునకానంద నాయుడిగా, టీడీపీని శునకానంద పార్టీగా పిలుస్తాం!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • బాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు
  • ఇప్పుడు శునకానందం పొందుతున్నారు
  • విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. కోడికత్తి పార్టీ అంటూ వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు శునకానందం పొందుతున్నారని విమర్శించారు. కాబట్టి టీడీపీని ఇకపై శునకానంద పార్టీగా పిలుస్తామని తెలిపారు. చంద్రబాబును కూడా శునకానంద నాయుడిగా పిలుస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ రోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘చంద్రబాబు నాయుడు గారూ.. మా పార్టీని మీరు కోడి కత్తి పార్టీ అంటూ దిగజారి శునకానందం పొందుతున్నారు. కాబట్టి, ఇక మీదట మీ పార్టీని మేం శునకానంద పార్టీగా పిలుస్తాం. మిమ్మల్ని శునకానంద నాయుడుగా పిలుస్తాం. సరేనా?’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
vijaysai reddy
MP
Criticise
dogs party
  • Loading...

More Telugu News