Tej Pratap: పెళ్లి వద్దు మొర్రో అని మొత్తుకున్నా వినలేదు.. విడాకులకు కారణం చెప్పిన తేజ్ ప్రతాప్ యాదవ్

  • ఐశ్వర్య మోడరన్‌గా ఉంటుంది
  • నేనేమో పాతకాలపు మనిషిలా ఉంటా
  • ఈ నిర్బంధ జీవితం నాకొద్దు

తనకు ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు మొర్రో అని చెబుతున్నా వినకుండా ఐశ్వర్య‌రాయ్‌తో పెళ్లి చేశారని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. ఆమె బాగా మోడర్న్ అని, తానేమో చాలా పాతకాలపు మనిషినని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో ఐశ్వర్యరాయ్‌ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తాతయ్య డరోగా రాయ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కూడా. ఆమె తండ్రి చంద్రిక రాయ్ ఆర్జేడీ ఎమ్మెల్యే.

పాట్నాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు పదివేల మంది అతిథులు హాజరయ్యారు. తాజాగా, ఐశ్వర నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ తేజ్ ప్రతాప్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం హాట్ టాపిక్ అయింది. ఈ విషయమై తేజ్ ప్రతాప్ విలేకరులతో మాట్లాడుతూ.. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఈ వివాహం జరిగిందని పేర్కొన్నారు. తానో సేవకుడిగా మాత్రమే ఉండదలిచానని, ఈ నిర్బంధ జీవితం తనకు అవసరం లేదని పేర్కొన్నారు.

Tej Pratap
Aishwarya Rai
Bihar
RJD
Lalu prasad Yadav
  • Loading...

More Telugu News