Jaggareddy: నేను గెలిస్తే హరీశ్‌రావు పని ఔటేనని ఆయనకు తెలుసు: జగ్గారెడ్డి

  • సిద్ధిపేటను వదిలి హరీశ్ సంగారెడ్డిలో నిద్రిస్తున్నారు
  • నాపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు
  • గెలిపిస్తే చర్చిలలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా

తాను నోరు విప్పితే కేసులు పెట్టి, ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చెయ్యాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. నేడు సంగారెడ్డిలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడుతూ సిద్ధిపేటలో తాను గెలిస్తే హరీశ్ రావు పని ఔటేనని ఆయనకు తెలిసే సిద్ధిపేటను వదిలి సంగారెడ్డిలో నిద్రపోతున్నారని విమర్శించారు.

హరీశ్, చింత ప్రభాకర్‌లు తనపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తాను గెలిస్తే అన్ని చర్చిలలోని సమస్యలను పరిష్కరిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఏసు ప్రభువుపై ఒట్టేసి మరీ తానిచ్చిన మాటను తప్పనని స్పష్టం చేశారు.

Jaggareddy
Harish Rao
chinta Prabhakar
siddipet
Sangareddy
  • Loading...

More Telugu News