varalakshmi sharath kumar: నేను కొత్తగా కనిపించాలి .. నా పాత్ర కొత్తగా అనిపించాలి అంతే: వరలక్ష్మీ శరత్ కుమార్

  • 'సర్కార్ 'లో నా పాత్ర నచ్చుతుంది 
  • ఒకే తరహా పాత్రలు చేయను
  • విభిన్నమైన పాత్రల్లోనే సంతృప్తి      

'పందెం కోడి 2' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్, దీపావళి పండుగ సందర్భంగా 'సర్కార్' సినిమాతో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పాత్ర అంతటి వైవిధ్యంగా ఉంటుంది.

మొదటి నుంచి కూడా కొత్తదనానికి ప్రాధాన్యత ఇవ్వడమే నాకు అలవాటు. నేను హీరోయిన్ గా మాత్రమే చేయాలి అని ఎప్పుడూ గిరి గీసుకున్నది లేదు. నేను చేసే పాత్ర కొత్తగా ఉండాలి .. తెరపై నేను కాకుండా పాత్ర మాత్రమే కనిపించాలని అనుకుంటాను. అందువల్లనే ఒక్క తమిళంలోనే నేను చాలా విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చాను. సుదీర్ఘ కాలంపాటు హీరోయిన్ గా ఉంటూ .. ఒకే తరహా పాత్రలను చేయడమనేది నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు .. అది నాకు సంతృప్తిని కూడా ఇవ్వదు" అని చెప్పుకొచ్చింది.      

varalakshmi sharath kumar
  • Loading...

More Telugu News