ram madhav: దేశాన్ని కాపాడటం కాదు.. ముందు మీ పదవిని కాపాడుకోండి: రాంమాధవ్

  • పార్టీ సిద్ధాంతాలను వదిలేసి.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు
  • సొంత పార్టీ నేతలందరికీ వెన్నుపోటు పొడిచారు
  • ప్రజాదరణ లేని చర్యలకు టీడీపీ పాల్పడుతోంది

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ నిప్పులు చెరిగారు. దేశాన్ని కాపాడే బాధ్యత తనపై ఉందని చంద్రబాబు చెబుతున్నారని... ఆయన తన పదవిని కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చెప్పారు. ఒకప్పుడు సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... ఇప్పుడు సొంత పార్టీ నేతలందరికీ వెన్నుపోటు పొడిచారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, కాంగ్రెస్ పార్టీతో అనైతికంగా పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అవినీతిని తలపించే రీతిలో ప్రజాదరణ లేని చర్యలకు టీడీపీ పాల్పడుతోందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాంమాధవ్ పైవ్యాఖ్యలు చేశారు. 

ram madhav
Chandrababu
congress
Telugudesam
bjp
  • Loading...

More Telugu News