Pawan Kalyan: ఒకరికి కేసుల భయం.. మరొకరికి బ్లాక్ మనీ భయం: చంద్రబాబు
- మోదీ అంటే జగన్, పవన్ లకు భయం
- అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత పవన్ కనిపించకుండా పోయారు
- ప్రధాని అయ్యే అవకాశం నాకు రెండు సార్లు వచ్చింది
వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ కల్యాణ్... తీరా అవిశ్వాసం పెట్టిన తర్వాత కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అంటే జగన్, పవన్ లకు భయమని చెప్పారు. ఒకరికేమో కేసుల భయమని, మరొకరికి బ్లాక్ మనీ భయమని అన్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అవసరం లేకపోయినా... అవినీతి పార్టీని లోబరుచుకుని బీజేపీ ఓట్లు వేయించుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తనకు ప్రధాని పదవిపై వ్యామోహం లేదని... ఆ పదవిని చేపట్టే అవకాశం తనకు గతంలోనే రెండు సార్లు వచ్చిందని అన్నారు.