Andhra Pradesh: తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెడితే.. అదే టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ నేతల కాళ్లదగ్గర పెట్టారు!: లక్ష్మీపార్వతి

  • టీడీపీని బాబు పతనావస్థకు తీసుకెళ్లారు
  • అవినీతి కేసుల నుంచి రక్షణకే కాంగ్రెస్ తో చెలిమి
  • టీడీపీ-కాంగ్రెస్ పొత్తుకు నిరసనగా ధర్నా

తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన భార్య లక్ష్మీపార్వతి తెలిపారు. ఏ జాతీయ పార్టీకి లొంగకుండా ఆత్మగౌరవంతో ఎన్టీఆర్ వ్యవహరించారని అన్నారు. అలాంటి వ్యక్తి స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టారనీ, కాంగ్రెస్ పార్టీ నేతలకు సాగిలపడ్డారని విమర్శించారు. టీడీపీ-బీజేపీ పొత్తుకు నిరసనగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి ఈ రోజు ఆందోళనకు దిగారు.

తన భర్త స్థాపించిన పార్టీని చంద్రబాబు ఈ స్థాయికి దిగజార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన చర్యలతో టీడీపీని పతనావస్థకు తీసుకెళ్లారని విమర్శించారు. నిజంగా ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవ నినాదం కాపాడటం కోసమే కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపారా? లేక అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి చేరారా? అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని లక్ష్మీపార్వతి ప్రకటించారు. బాబు చర్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
NTR
self respect
Telugudesam
Chandrababu
Congress
alligence
ntr ghat
legal fight
  • Loading...

More Telugu News