devineni uma: మీరు మోదీకి అనుకూలమా? వ్యతిరేకమా? తేల్చిచెప్పండి!: పవన్‌, జగన్‌లకు దేవినేని సూటిప్రశ్న

  • మీ చీకటి ఒప్పందాలు ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా?
  • ప్రశ్నించాల్సిన వారిని వదిలేసి మాపై కుట్రలెందుకు
  • ప్రజలకు మీరు రాజకీయ వినోదాన్ని అందిస్తున్నారని ఫైర్‌

మోదీ విషయంలో పవన్‌, జగన్‌ల వైఖరిని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ రోజు ప్రశ్నించారు. ‘తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోలేరని భావించవద్దు. మాపై విమర్శలు చేయడానికి ముందు మీరు మోదీకి వ్యతిరేకమా, అనుకూలమా? అన్నది ప్రజలకు తేల్చిచెప్పండి’ అన్నారాయన.

మోదీ ఆధ్వర్యంలో సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ‘విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు చేస్తుంటే మాట్లాడరు, పోలవరానికి నిధులివ్వకున్నా అడగరు, బీజేపీతో అంటకాగుతూ టీడీపీపై విమర్శలు మాత్రం చేస్తుంటారు. మీ విన్యాసాలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయి’ అని దేవినేని ఎద్దేవా చేశారు.

devineni uma
fires on jagan pawan
  • Loading...

More Telugu News