India: 59 నిమిషాల్లోనే రూ.కోటి రుణం.. కంపెనీలకు బంపరాఫర్ ప్రకటించిన ప్రధాని మోదీ!

  • ఎంఎస్‌ఎంఈలకు దీపావళి కానుక
  • సులభంగా పర్యావరణ అనుమతులు
  • కొత్త రుణాలపై 2 శాతం రాయితీ

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోదీ ముందుగానే దీపావళి కానుకను ప్రకటించారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వెబ్ సైట్ లో రిజస్టర్ అయిన ఈ కంపెనీలకు కేవలం 59 నిమిషాల్లోనే రూ.కోటి రుణం పొందేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ను ఆవిష్కరించారు. అలాగే కార్మిక చట్టాలను సరళీకరిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. కంపెనీలు సులభంగా పర్యావరణ అనుమతులు పొందేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

జీఎస్టీలో నమోదయిన ఈ కంపెనీలు కొత్తగా తీసుకునే రుణాలపై 2 శాతం రాయితీ ఇస్తామన్నారు. అలాగే ఈ సంస్థలు ఎగుమతుల కోసం తీసుకున్న రుణాలపై 5 శాతం రాయితీ ఇస్తామన్నారు. రూ.కోటి వరకూ ఉన్న రుణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు. ఇకపై కంపెనీలను అధికారులు ఇష్టానుసారం తనిఖీల పేరుతో వేధించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వరంగ సంస్థల సమీకరణలో కనీసం 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఎంఎస్ఎంఈ పరిశ్రమలు సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు రూ.6,000 కోట్లతో 20 కేంద్రాలు, 100 టూల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News