Andhra Pradesh: చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టింగ్ లు.. యువకుడిని జైలుకు పంపిన పోలీసులు!

  • అనంతపురం యువకుడి తుంటరి పని
  • అభ్యంతకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు
  • కటకటాల వెనక్కు నెట్టిన అధికారులు

సోషల్ మీడియాతో లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అందుకు మరో ఉదాహరణ ఇది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన పోస్టులు చేసిన యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లా పాట్రపల్లి గ్రామానికి చెందిన జి.రాజారెడ్డి అనే యువకుడు గత 26న చంద్రబాబు ‘ఆకస్మిక మరణం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే జగన్, ఎన్టీఆర్ లను చంద్రబాబు కత్తితో పొడుస్తున్నట్లు ‘వెన్నుపోటు బాబు’ అని మార్ఫింగ్ ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్టులను గమనించిన టీడీపీ గుంటూరు జిల్లా ప్రచార కార్యదర్శి చిట్టాబత్తిని శ్రీనివాసరావు, మైనార్టీ సెల్‌ నాయకుడు మీరావలి అదే రోజు మంగళగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాజారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరులోని 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపర్చగా.. రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో నిందితుడిని అధికారులు కటకటాల వెనక్కు నెట్టారు.

Andhra Pradesh
Chandrababu
Anantapur District
Guntur District
objectional posts
youth
arrested
remand
Police
court
morphing photos
  • Loading...

More Telugu News