GVL Narasimharao: మీడియాపై చిందులేసిన జీవీఎల్.. హితవు పలికిన విలేకరులు!

  • విలేకరులను మీదే పార్టీ అని అడిగిన జీవీఎల్
  • అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఆగ్రహం
  • మనుగడ కోసమే చంద్రబాబు కూటమి కట్టారన్న బీజేపీ నేత  

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాపై చిందులేశారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మండిపడ్డారు. మీరే పార్టీకి చెందిన వారంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.

జీవీఎల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విలేకరులు.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని హితవు పలికారు. దీంతో వెనక్కి తగ్గిన జీవీఎల్ అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ మనుగడ కోసమే చంద్రబాబు జాతీయ కూటమితో జట్టు కట్టారని ఆరోపించారు. దేశాన్ని రక్షిద్దామని చంద్రబాబు పిలుపు ఇచ్చారని, దేశం అంటే ‘తెలుగుదేశం’ అని ఎద్దేవా చేశారు.  

GVL Narasimharao
BJP
Tirupati
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News